TG Job Calendar: తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 18 వేల పోస్టులతో క్యాలెండర్ రూపొందించినట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. 2025 ఆగస్టు వరకు భర్తీ చేయబోయే పోస్టులతో షెడ్యూల్ రూపొందించారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించాలని అధికారులు భావిస్తున్నారు.
వాస్తవానికి ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సి ఉండగా.. లోక్సభ ఎన్నికల కారణంగా క్యాలెండర్ విడుదల కాలేదు. ప్రస్తుతం శాఖల వారీగా ఖాళీల వివరాలను గుర్తించిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో గ్రూప్- 1, 2, 3,4 తో పాటు జిల్లా స్థాయి పోస్టుల వివరాలు, టీచర్స్, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు వివరాలను విడివిడిగా పేర్కొన్నట్టు టాక్. దాదాపు 18 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు నెల నుంచి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.