TG Job Calendar: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమలు, సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమలు, సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. గురువారం శాసనసభలో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినా.. మరో 20 లక్షల మంది పైగా అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రభుత్వపరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదన్నారు. నైపుణ్యం పెంపొందించేందుకు పారిశ్రామికవేత్తలు, వీసీలు, విద్యార్థులతో పలు దఫాలు చర్చించి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపనకు ప్రతిపాదిస్తున్నామన్నారు. రాష్ట్రానికి సంబంధించి 20 లక్షలకు పైగా నిరుద్యోగులకు సంబంధించిన ఈ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. స్కిల్ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుందని, రాష్ట్ర ఆర్థిక వృద్ధుని పెంచుతుందని మంత్రి తెలిపారు.
✅నిరుద్యోగుల కోసం: SSC MTS.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.