AP DSC 2024: నవంబర్ 6న 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చక చకా అడుగులు వేస్తోంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. నవంబర్ 6వ తారీకున నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. న్యాయ వివాదాలు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన నాలుగు నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

ఖాళీల వివరాలు:

సెకండరీ గ్రేడ్ టీచర్లు(SGT)- 6,371 పోస్టులు
స్కూల్ అసిస్టెంట్లు- 7,725 పోస్టులు
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT)- 1,781 పోస్టులు
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT)- 286 పోస్టులు
ప్రిన్సిపాల్- 52 పోస్టులు
వ్యాయామ టీచర్లు(PET)- 132 పోస్టులు

Leave a Comment

error: Content is protected !!