తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, శాంపుల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు PGDCA కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. శాంపుల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హతతో పాటు సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 22 నుంచి 48 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.19,500/-; షాంపుల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.15,600 జీతం ఉంటుంది. ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి ఎటువంటి అలవెన్సులు ఉండవు.
అర్హత కలిగిన అభ్యర్థులు 20-11-2024 తేదీ లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి ఫీజు ఉండదు.. ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి