TGPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) సిలబస్ (తెలుగులో)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించే తెలంగాణా అటవీ శాఖలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ (FBO) పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్ -1: జనరల్ నాలెడ్జ్: ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు.
పేపర్ -2 : గణిత శాస్త్రం : ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు.
ప్రతి పరీక్షకు 90 నిమిషాలు సమయం ఇస్తారు.
పేపర్ -1 సిలబస్ – జనరల్ నాలెడ్జ్ (100 మార్కులు)
- కరెంట్ అఫైర్స్- ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు.
- నిత్యజీవితంలో జనరల్ సైన్సు అనువర్తనాలు.
- పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ.
- భారత దేశ మరియు తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ.
- భారత రాజ్యాంగం – ముఖ్యాంశాలు.
- భారత ప్రభుత్వం మరియు రాజకీయ వ్యవస్థ.
- భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర.
- తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం.
- తెలంగాణా సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం.
- తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు.
- నైతిక విలువలు, బలహీన వర్గాలు, మహిళల పట్ల సున్నితత్వం, సామాజిక అవగాహన.
పేపర్-2 సిలబస్ – గణిత శాస్త్రం (SSC Standard) (100 మార్కులు)
- అంకగణితం
- బీజగణితం
- త్రికోణమితి
- జ్యామితి (రేఖాగణితం)
- క్షేత్రగణితం
- గణాంకాలు