తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ 2025 ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి నెలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
TGPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పరీక్ష విధానం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించే తెలంగాణ అటవీ శాఖలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ (FBO) పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్ -1: జనరల్ నాలెడ్జ్: ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు.
పేపర్ -2 : గణిత శాస్త్రం : ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు.
ప్రతి పరీక్షకు 90 నిమిషాలు సమయం ఇస్తారు.
అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రీవియస్ ప్రశ్నపత్రాలు, “కీ”లను డౌన్లోడ్ చేసుకోగలరు
FBO Paper-1 Previous Question Paper
FBO Paper-2 Previous Question Paper
పేపర్ -1 సిలబస్ – జనరల్ నాలెడ్జ్ (100 మార్కులు)
- కరెంట్ అఫైర్స్- ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు.
- నిత్యజీవితంలో జనరల్ సైన్సు అనువర్తనాలు.
- పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ.
- భారత దేశ మరియు తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ.
- భారత రాజ్యాంగం – ముఖ్యాంశాలు.
- భారత ప్రభుత్వం మరియు రాజకీయ వ్యవస్థ.
- భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర.
- తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం.
- తెలంగాణా సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం.
- తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు.
- నైతిక విలువలు, బలహీన వర్గాలు, మహిళల పట్ల సున్నితత్వం, సామాజిక అవగాహన.
పేపర్-2 సిలబస్ – గణిత శాస్త్రం (SSC Standard) (100 మార్కులు)
- అంకగణితం
- బీజగణితం
- త్రికోణమితి
- జ్యామితి (రేఖాగణితం)
- క్షేత్రగణితం
- గణాంకాలు
క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ (తెలుగు & English medium) డౌన్లోడ్ చేసుకోగలరు
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RRB, SBI Clerk” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.