TG Group 3 Hall Tickets: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాతపరీక్షల హాల్ టికెట్లను విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఆదివారం హాల్ టిక్కెట్లను విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు
మొత్తం 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను నవంబర్ 17, 18 తారీకుల్లో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 3 పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్-2లో హిస్టరీ, పాలిటి మరియు సొసైటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్-3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. మూడు పేపర్లలో కలిపి 450 మార్కులు ఉంటాయి.